మిర్చి ట్రాక్టర్ బోల్తా… మహిళ మృతి

మిర్చి ట్రాక్టర్ బోల్తా… మహిళ మృతి
మిర్చి కూలీలతో వెళ్తుండగా ప్రమాదం
ఇద్దరికి తీవ్ర గాయాలు… ఆసుపత్రికి తరలింపు…
ఆంధ్రప్రభ వత్సవాయి : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామం వద్ద మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ (65) ఈ ప్రమాదంలో మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మడిపల్లి గ్రామానికి చెందిన రైతు బిట్ర కృష్ణకు చెందిన మిర్చి పొలంలో పనులు ముగించుకుని కూలీలు తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
గాయపడిన వారిని వెంటనే మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

