పంగిడీలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా

పంగిడీలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా
సిర్పూర్ (యు) ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ) కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని పంగిడి పంచాయతీ కేంద్రంలో నీటి ఎద్దడి తలెత్తడంతో పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలీ0షా శుక్రవారం టాంకర్ ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పంగిడి పంచాయతీలో మిషన్ భగీరథ నీరు సరఫరా కాక ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ప్రారంభించామని సర్పంచ్ తెలిపారు. సంబంధిత ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకొని మిషన్ భగీరథ నీటి సరఫరా జరిగే విధంగా చూడాలని సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా కోరారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం మనుమడు కుమ్ర సోనేరావు, వార్డు మెంబర్ టార్పే సతీష్ , నాయకులు పర్చకి మారు, కేశవరావు,ప్రజలు పాల్గొన్నారు.
