ఎస్సై ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు….

ఎస్సై ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు….

ఎల్కతుర్తి ఆంధ్రప్రభ : అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎల్కతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు ప్రాథమిక విచారణలో నిజమని తేలడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ను సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) హెడ్ క్వార్టర్స్కుఅటాచ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతకొంతకాలంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుకఅక్రమ రవాణా, భూ వివాదాలు, ఇతర సివిల్ పంచాయితీల్లో ఎస్సై ప్రవీణ్ కుమార్ తలదూరుస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకువరుసగా ఫిర్యాదులు అందాయి.

దీనిపై అంతర్గతవిచారణ జరిపిన ఉన్నతాధికారులు, ఎస్సై తీరుపై ఒకసమగ్ర నివేదికను కమిషనర్ కు సమర్పించారు. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు అధికారులు సమర్పించిన నివేదికలో ఎస్సైపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను తక్షణమే విధుల్లో నుంచి తొలగించి ఏఆర్కు బదిలీ చేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఈ సందర్భంగాపోలీస్ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రవీణ్ కుమార్ బదిలీతో ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్కు కొత్త ఎస్సైగా ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం స్టేషన్ బాధ్యతలను స్థానిక సీఐ పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply