iplmatches2026 : గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్

iplmatches2026 : గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్

iplmatches2026 : అట్టడుగున కేకేఆర్.. జోరు మీద గుజరాత్

iplmatches2026 ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు జరగనున్న 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ పోరు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులు ఈ ఉత్కంఠభరిత పోరును స్టార్ స్పోర్ట్స్ మరియు జియో హాట్ స్టార్ వేదికగా ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

కేకేఆర్ పరిస్థితి దారుణం.. ఫ్యాన్స్ ఆశలు నెరవేరుతాయా?

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి ఈ సీజన్‌లో అత్యంత నిరాశాజనకంగా ఉంది. కేకేఆర్ ఇప్పటి వరకు ఈ సీజన్‌లో తన విజయాల ఖాతా తెరవలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ ఘోర పరాజయం పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించకపోవడం అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. కనీసం ఈ రోజైనా తమ జట్టు బోణీ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫామ్‌లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్

మరోవైపు, హోమ్ టీమ్ గుజరాత్ టైటాన్స్ (GT) ఈ సీజన్‌లో మెల్లగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిచి, రెండు ఓడింది. విశేషమేమిటంటే, తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన గుజరాత్.. ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు మ్యాచ్‌లలో సంచలన విజయాలు నమోదు చేసి మంచి ఫామ్‌లో ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు కేవలం నాలుగు సార్లు తలపడగా, గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్‌లలో గెలిచి ఆధిపత్యం ప్రదర్శించగా, కోల్‌కతా కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది.

తుది జట్లు (అంచనా):

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడా, మానవ్ సుతార్ / అశోక్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్), సునీల్ నరైన్, టిమ్ సైఫర్ట్, అంగ్‌క్రిష్ రఘువంశీ, కామెరూన్ గ్రీన్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, వరుణ్ చక్రవర్తి.

iplmatches2026
iplmatches2026

Leave a Reply