Central Govt | కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి వినతి!

Central Govt | కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి వినతి!

Central Govt | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలో పండించిన యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కీలక విన్నపం చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం సేకరణపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

2025-26 యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుండి కనీసం 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ (ఉప్పుడు) ధాన్యాన్ని సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు.

ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగిందని, దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల పంట వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించారు.

ఇంత భారీ స్థాయిలో వస్తున్న దిగుబడిని సేకరించడంలో కేంద్రం సహకారం అందిస్తేనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని, కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ విన్నపంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరణ లక్ష్యాలు, ఎఫ్‌సీఐ (Fఛీ) ద్వారా సేకరణ ప్రక్రియపై త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ భేటీతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న సందిగ్ధత తొలగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply