water melon |ప్రయోజనాలు మీకు తెలుసా..

water melon |ప్రయోజనాలు మీకు తెలుసా..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భానుడు నిప్పులు కక్కుతున్నాడు. భాస్కరుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే జనం ప్రజలు భయపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం దాహంతో అల్లాడిపోతున్నారు. చల్లని పానీయాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఎండ తీవ్రతకు పండు పుచ్చకాయ తింటే ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. ఈ పండును తింటే దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ పండును చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సాయపడుతుంది. ఇందులో విటమిన్ సీ కూడా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని అందిస్తుంది.

- పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది.
- ఇది డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడటంలో సాయపడుతుంది.
- రెండు కప్పుల పుచ్చకాయ తింటే కేవలం 80 కేలరీల శక్తి మాత్రమే వస్తుంది.
- పుచ్చకాయలో విటమిన్ సి, ఎ, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
- రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దోహదపడుతుంది.
- పుచ్చకాయ తినడంతో ఉక్కపోత, వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.
- చెమట రూపంలో కోల్పోయిన నీరు తిరిగి వస్తుంది.
- వేడికి కమిలిన చర్మానికి పుచ్చకాయ గుజ్జు పెడితే చర్మం నిగనిగలాడుతోంది.
- మూత్రం సరిగా రానపుడు, మూత్రం మంటగా అనిపించినపుడు పుచ్చకాయ తింటే మేలు చేస్తుంది.
- ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం గుండెను కాపాడుతుంది.
- జ్వరంతో బాధ పడుతున్నపుడు పుచ్చకాయ రసంలో తేనె కలిపి తినిపిస్తే తిరిగి శక్తి వస్తుంది.
- మల బద్దకం ఉన్నపుడు ప్రతి రోజు పుచ్చకాయ తింటే మంచిది.
- పుచ్చకాయలో అమినో యాసిడ్ ‘ఎల్-సిట్రులైన్’ అత్యధికంగా ఉంటుంది.
- ఇది శరీరంలోకి వెళ్ళాక నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సాయపడుతుంది.
- ఇది రక్తనాళాల్ని రిలాక్స్ చేస్తుంది. దీంతో రక్త ప్రసరణ సాఫీగా జరిగి బీపీ తగ్గుతుంది.
- పుచ్చకాయలో 40 శాతం ఎక్కువ లైకోపీన్ ఉంటుందని న్యూట్రిషనిస్ట్ చెబుతున్నారు.
- లైకోపీన్ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్.
- ఇది శరీరంలో వాపుల్ని తగ్గించడమే కాకుండా ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా చేస్తోంది.
- షుగర్ ఉన్నవారు పుచ్చకాయను మితంగా తినాలి.
- జ్యూస్ రూపంలో తాగకూడదు.
- జ్యూస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.
- కిడ్నీ సమస్య ఉన్నవారు పుచ్చకాయ తినకపోవడం మంచిది.

ఏ సమయంలో తింటే మంచిది..
పుచ్చకాయను మధ్యాహ్నం వేళ తినడం మంచిది. ఈ సమయంలో జీవక్రియ వేగంగా ఉండటం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా శరీరాన్ని చల్లబరిచి, వడదెబ్బ తగలదు. రాత్రిపూట తినడం వల్ల గుండెల్లో మంట లేదా జీర్ణక్రియలో ఇబ్బందులు రావొచ్చు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల, రాత్రిపూట తింటే తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.
