బెజ్జంకిలో కొండచిలువ కలకలం..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలం పరిధిలోని గుండారం గ్రామంలో గురువారం ఉదయం కొండచిలువ కనిపించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం పరిసర ప్రాంతంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు భారీ కొండచిలువను గమనించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

చెట్ల దగ్గర నేలపై పొడవుగా విరాజిల్లుతూ ఉన్న ఈ కొండచిలువను చూసి వారు పనులు నిలిపివేసారు. అయితే కొండచిలువ ఎవరికి ఎటువంటి హాని చేయకుండానే అటవీ ప్రాంతం వైపు కదిలిపోయినట్లు స్థానికులు తెలిపారు. అడవి ప్రాంతాల దగ్గర పని చేసే వారు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు సూచించారు. ఈ ఘటనతో గుండారం గ్రామంలో కొంతసేపు కలకలం రేగింది.

Leave a Reply