HYD | డిపాజిట్ స్లిప్ నింపుతుండగా…

HYD | డిపాజిట్ స్లిప్ నింపుతుండగా…
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని హబ్సిగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. బ్యాంక్లో డిపాజిట్ స్లిప్ నింపుతుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు.
డిపాజిట్ స్లిప్ నింపుతున్న సమయంలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బ్యాంక్లో కలకలం రేగింది. ఈ విషాద సంఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంక్ సీసీటీవీలో రికార్డు కావడం గమనార్హం.

