చట్టసభలలో మహిళా కోట అభినందనీయం

చట్టసభలలో మహిళా కోట అభినందనీయం

వికారాబాద్, ఆంధ్రప్రభ: నారీ శక్తి వందన్ సనాతన ధర్మంలో ఆదిపరాశక్తిగా కొలిచే మహిళకు నేటి పరిస్థితులు ఇస్తున్న అత్యున్నత స్థానం… ఇప్పటి వరకు మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా దూసుకుపోతున్న ఈ తరుణంలో కేవలం ఒక రాజకీయ క్షేత్రం లో సరైన స్థానం లేక వెనకబడిన నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నారి శక్తి వందన్ అభియాన్ పేరుతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ చట్టసభల్లో కల్పించడం అనేది గర్వించదగ్గ విషయం అని వికారాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షురాలు ఎస్కి శిరీష తెలిపారు. బుధవారం ఆమె ప్రభా న్యూస్ తో మాట్లాడుతూ.. నాటి నుండి కూడా మహిళలు రాజనీతిలో యుద్ధ రంగంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

మధ్యలో జరిగిన కొన్ని దాడుల వల్ల మహిళలకు రక్షణ నిమిత్తమై కొంత స్వేచ్ఛను తగ్గించడం వల్ల మహిళలు వంటింటికి పరిమితం అనే ఒక నానుడి వచ్చింది. కానీ భారతీయ మహిళ ఏ రోజు కూడా అబల కాదు ఆపరేషన్ సింధూర పేరుతో మహిళలతో చేపట్టిన ఒక అనూహ్యమైన యుద్ధాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన మహిళలు ఉన్న భారతదేశంలో చట్టసభల్లో కూడా వారికి సముచిత స్థానం కల్పించడం హర్షించదగ్గ విషయం. ఈ ఒక్క అడుగుతో భారతదేశంలో మహిళా సాధికారత కు సముచిత స్థానం దొరుకుతుందని తద్వారా వికసిత్ భారత్ సాధ్యం అవుతుంది. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మహిళలకు కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply