సామాజిక సమానత్వ మార్గదర్శకుడు భారతరత్న అంబేద్కర్…

సామాజిక సమానత్వ మార్గదర్శకుడు భారతరత్న అంబేద్కర్…

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

గుడివాడ, ఆంధ్ర‌ప్ర‌బ : రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడిగా భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు, భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు.సమాజమే దేవాలయం – ప్రజల దేవుళ్ళన్న ఎన్టీఆర్ నినాదం… అంబేద్కర్ స్ఫూర్తితో పుట్టిందేనని ఆయన అన్నారు.

గుడివాడ ప్రజా వేదిక(టీడీపీ)కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఉదయం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు అంబేద్కర్ చత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, జోహార్ అంబేద్కర్…జై భీమ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము అంబేద్కర్ జయంతి కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…. హక్కు అంటే ఏమిటో తెలియని అణగారిన స్థాయి నుండి జీవితాన్ని ప్రారంభించి కోట్లాదిమందికి హక్కులు కల్పించిన మహోన్నతుడు అంబేద్కర్, ప్రపంచంలోనే అరుదైన మహానేత అని కొనియాడారు.
గత ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కితే… అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందు సాగుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు.

అనంతరం జై భీమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్, ఆదిమాంధ్ర సంఘం, పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ లోని అంబేద్కర్ భవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము… అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము దళిత సంఘాల నాయకులకు, అంబేద్కర్ అభిమానులకు తినిపించారు.

జయంతి వేడుకల్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్,మార్కెట్ యాడ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టిడిపి అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య,మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి,బిజెపి నాయకుడు అంగడాల సతీష్, టిడిపి నాయకులు కంచర్ల సుధాకర్, పిన్నమనేని బాబ్జి, గుడివాడ జోన్స్, మెరుగు మోజెస్, కరె వెంకటగిరి, చేకూరు జగన్మోహన రావు, పిల్ల సాల్మన్ రాజు, నిరంజన్, వేసపోగు ఇమ్మానుయేలు, రెడ్డి అప్పారావు, రెడ్డి షణ్ముఖ,యార్లగడ్డ సుధారాణి, సిరిపురపు తులసీరాణి, మాదాల సునీత , అందుగుల యేసు పాదం, పైడిముక్కల వంశీ, కనకాంబరం, డొక్కు మాల శ్రీకాంత్, రామిదేని వేణుబాబు, గడ్డం ప్రకాశ్ దాస్, వంగపండు ఆదినారాయణ, మజ్జాడ నాగరాజు తెలుగు యువత, తెలుగు మహిళలు, అనుబంధు విభాగాల నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply