కళ్యాణమండప నిర్మాణానికి విరాళం..

కళ్యాణమండప నిర్మాణానికి విరాళం..

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : దివిసీమకు కొంగుబంగారమై, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల మనసుల్లో విరాజిల్లుతున్న గ్రామ దేవత లంకమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో కళ్యాణమండప నిర్మాణానికి ఉదార విరాళం అందింది. ఆలయ ఆవరణకు ఆనుకుని ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి కళ్యాణమండపం నిర్మించేందుకు మొత్తం వ్యయం రూ. 27 లక్షలు కాగా, అందులో భాగంగా రూ. 13,50,000 విలువైన చెక్కును సోమవారం ఎవర్ గ్రీన్ గ్రూప్స్ ప్రాజెక్ట్ “విన్ రైజ్” (రియల్ ఎస్టేట్) అధినేత మండలి రామకృష్ణ విరాళంగా అందజేశారు.

గత సంవత్సరం డిసెంబర్ 11న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆలయ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అన్నపరెడ్డి వెంకటస్వామి పాలకవర్గ సభ్యులను రామకృష్ణ అభినందించారు. ఆలయ అభివృద్ధి పనులకు తన వంతు సహాయం అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసు (వాసు) రామకృష్ణను దుశ్యాలవేసి సత్కరించి, ఆయన చేసే ప్రతి సత్కార్యానికి అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అవనిగడ్డ మండల ధర్మచార్యులు కృష్ణ, పాలకవర్గ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply