పోలీస్ అక్క సేవలు భేష్ : డీజీపీ శివధర్ రెడ్డి

నిర్మల్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా పోలీస్… మీ పోలీస్.. పోలీస్ అక్క నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల సేవలు భేష్ అని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కొనియాడారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు.
పోలీస్ అక్క పేరుతో సేవలందించేందుకు ప్రజలకు ఎంతో మమేకమై వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారిలో ఒకరిగా నిర్మల్ పోలీస్ అక్క సేవలు జాతీయ వ్యాప్తంగా గుర్తింపు రావడం పోలీస్ శాఖకు గర్వకారణం అని పేర్కొన్నారు.
ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ పోలీసులు ప్రజలతో మరింత మమేకమై ముందుకు సాగేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్‌కు ఘన స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్, భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్, నిర్మల్ ఏఎస్పీ, సాయి కిరణ్, ఐపీఎస్, పూల మొక్కలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐ లు ఉన్నారు.
