ponnam prabhakar|ప్రేరేపిత సమ్మెలకు వెళ్లొద్దు
ponnam prabhakar|ప్రేరేపిత సమ్మెలకు వెళ్లొద్దు
ఆర్టీసీ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం : పొన్నం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఆర్టీసీ జేఏసీ సమ్మె సమావేశంపై స్పందించిన మంత్రి పొన్నం, ప్రేరేపిత అంశాలకు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రలోభం కావొద్దని సూచించారు. ఆర్టీసీలో విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ తప్ప ఇతర అంశాలు చర్చిస్తామన్నారు. ఆర్టీసీ విలీనం అంశం కమిటీ దగ్గర ఉంది. రెండు సమస్యలు మినహా మిగతా అంశాలపై చర్చకు సిద్ధం. సిబ్బందికి సంబంధించిన అంశాలు పరిష్కరిస్తాం. పెండింగ్ డీఏ ఇచ్చాం. పీఆర్సీ ఆలోచన చేస్తున్నాం. కార్మికులు ప్రేరేపిత సమ్మెలకు వెళ్లొద్దని పొన్నం అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అరైవ్ అలైవ్ పోస్టర్ ఆవిష్కరించారు. పోలీస్, రవాణా శాఖ సంయుక్తంగా అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం చేపడుతున్నామని, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజలను చైతన్యపరిచేందుకు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నామని తెలిపారు.
