Market | పడిపోయిన ఎగ్ రేట్

Market | పడిపోయిన ఎగ్ రేట్
Market | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నిన్న మొన్నటి వరకు కొండెక్కిన కోడి.. నేడు దిగివచ్చింది. చికెన్, ఎగ్ రేట్లు అమాంతం తగ్గిపోయాయి. కొన్ని రోజుల క్రితం వరకు చికెన్ ధర ట్రిపుల్ సెంచరీ దాటేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం చికెన్ కిలో ధర వంద రూపాయల వరకు తగ్గింది. అలాగే కోడి గుడ్ల ధర కూడా అమాంతం పడిపోయింది. ఇందుకు కారణం ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. విదేశాలకు భారత్ నుంచి కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో భారత్‌లో నిల్వలు పేరుకుపోయి ధరలు తగ్గాయి. అలాగే వేసవిలో ఫామ్స్‌లో కోళ్ల నిర్వహణ కష్టమవుతుండటంతో దీంతో ఫామ్స్ నిర్వాహకులు కోళ్లను వెంటనే అమ్ముకుంటున్నారు. కోళ్ల సరఫరా ఎక్కువగా ఉండటం వల్ల ధరలు తగ్గుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటివరకు కేజీ చికెన్ రూ.350 వరకు పలకగా.. ఇప్పుడు రూ. 100 మేర తగ్గింది. కోడిగుడ్ల ధరలు ప్రస్తుతం హైదరాబాద్ జోన్‌లో 12 గుడ్ల రిటైల్ ధర రూ.68గా ఉంది.
