ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరాజు గౌడ్
ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరాజు గౌడ్
- గతంలో మర్రిగూడ పీహెచ్సీ స్థానచలనం గురించి కలిసి వినతి
- అన్ని గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలి
- అందుకే పీహెచ్సీ సేవలు విస్తరించాలని మంత్రికి, అధికారులకు వినతి
- స్పందించిన మంత్రి, అధికారులు దాని ఫలితమే నేడు కేబిపల్లి గ్రామానికి స్థాన చలనం
- వైద్యులు ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్య ధోరణి విడాలి
- వైద్యులు స్థానికంగా ఉండి ప్రజలకు వైద్య సేవలందించాలి
- వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందజేయాలని కోరుకుంటున్నాను
- బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీపీ అనంత రాజుగౌడ్
మర్రిగూడ, ఆంధ్రప్రభ : బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల కేంద్రం నుండి కుదబక్ష్ పల్లి గ్రామానికి తరలించినందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ ను ఆదివారం వారి క్యాంపు కార్యాలయంలో కలిసి పూలబోకె అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ.. పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని గత బిఆర్ఎస్ ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేసి స్వయంగా అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు ఒకే ఆవరణలో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి.
రెండు సెంటర్స్ ఒకేచోట ఉండి వైద్య సేవలు అందించడంలో మండల వ్యాప్తంగా ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు ఒకేచోట ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదని భావించి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండలంలోని మరొక గ్రామానికి తరలించాలని గతంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదరం రాజనర్సింహ, రాష్ట్ర హెల్త్ కమిషనర్, జిల్లా కలెక్టర్ లకు ఇట్టి సమస్యను వివరించి వినతి పత్రాలను అందజేయడం జరిగింది.
ఈ సమస్యను పరిశీలించిన మంత్రి, అధికారులు నేడు మండల పరిధిలోని కుదబక్షపల్లి గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించి అక్కడి పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామవరం రాజనర్సింహ, ఉన్నతాధికారులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖుదబక్స్ పల్లి గ్రామంలో పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందజేయాలని వైద్య సిబ్బందిని కోరుకుంటున్నానని తెలిపారు.
