Gujarat | ఎగబడిన జనం

Gujarat | ఎగబడిన జనం
Gujarat | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ వెళ్తున్న కొబ్బరి ట్రక్కు దాహోద్ బ్రిడ్జిపై బోల్తా పడింది. అయితే గాయపడిన డ్రైవర్‌ను రక్షించాల్సిన స్థానికులు కొబ్బరికాయలను ఎత్తుకెళ్లేందుకు ఎగబడ్డారు.
మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ వైపు వెళ్తున్న కొబ్బరి లోడుతో ఉన్న ట్రక్కు దాహోద్ బ్రిడ్జిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ గాయపడ్డాడు.

అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ను కాపాడాల్సిన స్థానికులు, ట్రక్కులో ఉన్న కొబ్బరికాయలను ఎత్తుకెళ్లేందుకు పోటీ పడ్డారు. ఘటనాస్థలంలో కొబ్బరికాయల కోసం హోరాహోరీగా పోటీ పడుతూ ఎత్తుకెళ్లిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
