చదువే సమాజ మార్పుకు ఏకైక ఆయుధం అని నమ్మిన పూలే

చదువే సమాజ మార్పుకు ఏకైక ఆయుధం అని నమ్మిన పూలే
పామర్రు – ఆంధ్రప్రభ : చదువే సమాజ మార్పుకు ఏకైక ఆయుధం అని నమ్మిన ఆ మహనీయుని ఆశయాలను సాధిద్దామని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. సమాజంలో అసమానతలపై పోరాడిన గొప్ప యోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి సందర్భంగా పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్ వారితోపాటు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

