ముంపు గ్రామాలను తరలించి పునరావాసం కల్పిస్తాం

ముంపు గ్రామాలను తరలించి పునరావాసం కల్పిస్తాం
- రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, ఆంధ్రప్రభ ; భీమా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన సంగంబండ ,భూత్పూర్ రిజర్వాయర్ల కింద పంపు గ్రామాలైన భూత్పూర్ ,నేరేడుగం ముంపు గ్రామాలను తరలించి పునరవాసం కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.భూత్పూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. భూత్పూర్ పునరావాసం కల్పిస్తామని చెప్పారు.
గురువారం మక్తల్ మండలంలోని భూత్పూర్ నుండి కొత్తపల్లి గ్రామానికి కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుండే బ్రిడ్జి పనులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. అతి త్వరలో వంతెన ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.నమ్మకం తో నన్ను ఎమ్మెల్యే గా గెలిపించుకున్న ఈ ఊరి కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నానని తెలిపారు.
భూత్పూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు. ముంపు గ్రామంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో నేరేడుగం, భూత్పూర్ గ్రామాలను తరలించి ఆయా గ్రామాల ప్రజలు సంతోషంగా జీవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భూత్పూర్ గ్రామ సర్పంచ్ సంగీత శేఖర్ గౌడ్ , మాజీ ఎంపిపి గడ్డంపల్లి హన్మంతు, మాజీ ఎంపిటిసి కుర్మయ్య గౌడ్ ,మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి.గణేష్ కుమార్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, భీమ్ సేన్ రావు ,రఘుపతి రెడ్డి, రాఘవేందర్ రెడ్డి ,బత్తలయ్య, గడ్డం రమేష్, కె.కృష్ణయ్య గౌడ్ ,చెన్నయ్య గౌడ్,జెడ్పి సీఈవో మొగులప్ప ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
