నర్రా రాఘవరెడ్డి బాటలో నడవాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

చిట్యాల, ఆంధ్రప్రభ : నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచి ప్రజలకు నిస్వార్థ సేవలందించిన ప్రజా నాయకుడు నర్రా రాఘవరెడ్డి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన అమరజీవి నర్రా రాఘవరెడ్డి 11వ వర్థంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ప్రజల మధ్య ఉండి, అసెంబ్లీలో ప్రజల సమస్యలను బలంగా వినిపించిన రాఘవరెడ్డి లాంటి నాయకులు నేటి రాజకీయాల్లో అరుదైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎల్‌బీసీ నీటిని తీసుకురావడంలో సిపిఎం శాసన సభ్యులతో పాటు రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆరు పర్యాయాలు నకిరేకల్ ఎమ్మెల్యేగా, సిపిఎం శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాఘవరెడ్డి ఆశయాల సాధన కోసం కృషి చేయడం కమ్యూనిస్టు కార్యకర్తల ముఖ్య కర్తవ్యమని పేర్కొన్నారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాఘవరెడ్డి సర్పంచ్‌గా, సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా పని చేస్తూ రైతులు, కూలీలు, గొర్రెలు–మేకల పెంపకదారులు, గ్రామ సేవకుల హక్కుల కోసం కృషి చేశారని తెలిపారు. ప్రజా నాట్య మండలి కళాకారుడిగా ప్రజల్లో చైతన్యం కలిగించిన వ్యక్తి రాఘవరెడ్డి అని అన్నారు. కార్యక్రమానికి ముందు రాఘవరెడ్డి విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మల్లు లక్ష్మి, తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారీ ఐలయ్య, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, మల్లం మహేష్, పెంజర్ల సైదులు, చింతపల్లి బయ్యన్న, రాచకొండ శ్యాంసుందర్, శీలా రాజయ్య, అరూరి శ్రీను, ఐతరాజు నర్సింహా, యాదయ్య, కల్లూరి కుమారస్వామి, మెట్టు నర్సింహా, పంది నరేష్, జిట్ట స్వామి, అక్కెనపల్లి నాగయ్య, నర్రా కిశోర్, పాలమాకుల అర్జున్, చింతపల్లి కృష్ణయ్య, బూరుగు విజయ్, శ్రీను, నర్రా శేఖర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమేష్, బాబురావు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply