vaibhav soorya vanshi |యార్క‌ర్ కింగ్‌కు చుక్క‌లు

vaibhav soorya vanshi |యార్క‌ర్ కింగ్‌కు చుక్క‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సెన్సేష‌న్‌గా మారాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెప‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు. నిన్న (మంగ‌ళ‌వారం) ముంబై ఇండియన్స్ బౌల‌ర్ల‌ను ఓ ఆటాడుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్ లాంటి వ‌ర‌ల్డ్ క్లాస్ బౌలింగ్‌ను తుత్తునియ‌లు చేశాడు. సిక్సర్లతో విరుచుకుపడి ఔరా అనిపించాడు. 15ఏల్ల వ‌య‌సులోనే అత్యుత్తమ బౌలర్లను సైతం భయపెడుతూ యంగ్ సెన్సేషన్‌గా నిలిచాడు. గువాహటి వేదికగా నిన్న ముంబై, రాజ‌స్థాన్ మ‌ధ్య జరిగిన మ్యాచ్‌లో వైభ‌వ్ విధ్వంసం సృష్టించాడు. త‌న దూకుడుతో రాజస్థాన్ భారీ స్కోరు చేయ‌డానికి దోహ‌ద ప‌డ్డాడు.

నిన్న‌టి మ్యాచులో రాజ‌స్థాన్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఓపెన‌ర్‌గా దిగిన వైభ‌వ్ బుమ్రా వేసిన తొలి బంతికే సిక్సర్ బాది అందర్నీ షాక్ చేశాడు. అత‌ని షాట్ల‌కు బూమ్రా కూడా షాక్ అయ్యాడు. మూడు బంతుల్లో రెండు సిక్సర్లు బాదడంతో బుమ్రా కూడా అవాక్కయ్యాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తం ఐదు సిక్సర్లు బాదాడు. వరల్డ్ నెంబర్ వన్ పేస్ బౌలర్ బుమ్రా బౌలింగ్‌లో బాల్ టచ్ చేయాలంటేనే చాలామంది భ‌య‌ప‌డ‌తారు. అలాంటిది మూడు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి అందర్నీ స్టన్నయ్యేలా చేశాడు వైభవ్ సూర్యవంశీ. గువాహటి స్టేడియంలో బుమ్రా, బౌల్ట్ బౌలింగ్‌లలో సిక్సర్ల వర్షం కురిపించాడు. 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి అవుటయ్యాడు.

తొలి ఇన్నింగ్ష్ రెండో ఓవర్ బుమ్రా వేశాడు. అత‌ని బౌలింగ్‌కి రాగానే స్ట్రయికింగ్‌లో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. తొలి బంతినే సిక్సర్ బాది అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. బుమ్రా కూడా ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లాడు. రెండో బంతి డాట్ కాగా మూడో బంతిని ఫైన్ లెగ్ మీదగా భారీ షాట్ కొడితే అది స్టాండ్స్‌లో పడింది. బుమ్రాతో పాటు మిగతా పది మంది ముంబై ప్లేయర్లు చూడటం తప్పించి, చేసేదేం లేక చేతులెత్తేశారు.

Leave a Reply