పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు,ఏప్రిల్ 6(ఆంధ్రప్రభ): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ దేయమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 135 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన రూ.1,35,15,666 లక్షల విలువచేసే చెక్కులను అందజేశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు.తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్,ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం అండగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం వినూత్నమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. పార్టీల కచ్చితంగా సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్,కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, మహిళ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షరాలు పింగళి ఉష, కౌన్సిలర్లు ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply