గోదావరి నీటితో వెంకటాద్రి చెరువు జలమయం…

గోదావరి నీటితో వెంకటాద్రి చెరువు జలమయం…

చిలుపూర్, ఆంధ్ర‌ప్ర‌భ : మండు వేసవిలో చెరువులోకి గోదావరి జలాలు రావడం రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. చిలుపూర్ మండలం పల్లగుట్ట గ్రామంలోని వెంకటాద్రి చెరువులోకి శనివారం గోదావరి జిల్లాలో చేరుకున్నాయి. నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఈ విషయాన్ని చిలుపూర్ ఆలయ చైర్మన్ శ్రీధర్ రావు వివరించారు.

దానితో శ్రీహరి వెంటనే స్పందించి గోదావరి జలాలను మల్లన్న గండి రిజర్వాయర్ నుండి తరలించి నీరు లేని చెరువులు, కుంటల్లోకి నీటిని నింపాలని ఆదేశించారు. శ్రీహరి ఆదేశం మేరకు అధికారులు గోదావరి జలాలను తరలించడంతో వెంకటాద్రి చెరువుతోపాటు పలు చెరువులు, కుంటలలోకి గోదావరి నీరు చేరుకుంది. దీనితో రైతులు ఎంతో సంతోషిస్తున్నారు.

నీటిని తరలింప చేసినందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో పాటు శ్రీధర్ రావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ రఫీ తో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply