బెట్టింగ్ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలి..

బెట్టింగ్ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలి..
ఘంటసాల – ఆంధ్రప్రభ : ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని ఘంటసాల ఎస్ఐ వేమన చందన యువతకు సూచించారు. సోమవారం ఘంటసాల గ్రామ యువతతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం గురించి వివరంగా అవగాహన కల్పించారు. చట్టవిరుద్ధమైన గేమింగ్, బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన పరిణామాలపై యువతకు తెలియజేశారు. సమాజ శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
