1ToAll | గ్యాస్ కోసం గుబులు… తీరేనా వంటింటి కష్టాలు?

1ToAll | గ్యాస్ కోసం గుబులు… తీరేనా వంటింటి కష్టాలు?

1ToAll | ఇరాన్ ఉద్రిక్తతలు… భారత్ వంటింటిపై ప్రభావం
గ్యాస్ కొరత… హోటళ్లకు షాక్, ప్రజలకు కష్టాలు
మిణుకుమిణుకుమంటున్న మంట… ఇల్లాళ్లలో గుబులు
ప్రపంచ రాజకీయాల ప్రభావం… సామాన్యుడిపై భారంగా.

1ToAll | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అందరిదీ అదే బాధ… కానీ ఇప్పుడు అది సాధారణ సమస్య కాదు… ఒక తీవ్రమైన ఆందోళనగా మారిపోయింది. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకచోట ప్రపంచాన్ని దహించేస్తున్న అగ్నికీలలు, మరోచోట వంటగదిలో మిణుకుమిణుకుమంటున్న గ్యాస్ మంట… Iran ఉద్రిక్తతల సెగ భారత్ ఇళ్లలోకే చేరిందా అన్న భయంకర సందేహం ప్రజల్లో కనిపిస్తోంది. ప్రభుత్వాలు “ఏమీలేదు” అంటూ భరోసా మాటలు చెబుతున్నా, నేలమీద వాస్తవాలు మాత్రం వ్యతిరేకంగా, ఆందోళనకరంగా ఉన్నాయి.

1ToAll
1ToAll

ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడగా, మరికొన్ని హోటళ్లు రేట్లు అమాంతం పెంచేయడం ప్రజలకు మరో షాక్ ఇచ్చింది. “రెండింతలు ఇచ్చినా సిలిండర్ దొరకడం లేదు” అన్న మాటలు వినిపిస్తుంటే, ఇది కేవలం సమస్య కాదు… ఒక అల్లకల్లోలం పరిస్థితిగా మారిందని చెప్పాలి.

ఇంట్లో పరిస్థితి ఇంకా ఎమోషనల్ డ్రామాలా ఉంది. వంటగదిలో గ్యాస్ మంట మిణుకుమిణుకుమంటూ ఉంటే, “ఇది ఎప్పుడు ఆరిపోతుందో?” అన్న భయం, గుబులు, ఆందోళనతో ఇల్లాళ్ల గుండెలు దడదడలాడుతున్నాయి. ఒకప్పుడు బంగారం, వెండి, సిరిసంపదల గురించి కలలు కనేవారు… ఇప్పుడు మాత్రం “సమయానికి గ్యాస్ సిలిండర్ వస్తే చాలు!” అనే సాధారణ కోరికే గొప్ప ఆశగా మారిపోయింది.

ఈ పరిస్థితిని చూసి నవ్వాలో, బాధపడాలో తెలియని విచిత్ర వాస్తవం ఏమిటంటే… పంచాంగ శ్రవణంలో అయినా పరిష్కారం దొరుకుతుందేమోనని ఆశగా, ఆత్రంగా అయ్యవారిని అడిగే స్థాయికి ప్రజలు చేరుకున్నారు. ఈ వ్యంగ్యమైన సత్యంను కార్టూన్ అద్భుతంగా, పుంజ్‌తో, హాస్యంతో కూడిన చేదు నిజంగా ఆవిష్కరించింది.

మొత్తానికి ఇది కేవలం గ్యాస్ కొరత కాదు… ప్రపంచ రాజకీయాల ప్రభావం ఎలా సామాన్యుడి జీవితాన్ని కుదిపేస్తుందో, ఇబ్బందుల్లో నెట్టేస్తుందో చెప్పే బలమైన సందేశం. నవ్వుల్లో దాగి ఉన్న ఈ కఠిన నిజం… ఇప్పటికైనా పరిష్కారం దిశగా అడుగులు పడతాయా అన్నదే అసలు ప్రశ్న!

click here to more cartoons

click here for oura cartoons

Leave a Reply