GBU-72 Attack : ఆ 3 కేంద్రాలు ధ్వంసం Andhra Prabha Detail Reoprt

GBU-72 Attack : ఆ 3 కేంద్రాలు ధ్వంసం Andhra Prabha Detail ReoprtA

  • GBU-72 బాంబుల బీభత్సం
  • హోర్ముజ్ కోసం తహతహ
  • అమెరికా సర్జికల్ స్ట్రయిక్
  • 3 కీలక భూగర్భ స్థావరాలు మట్టాష్

( ఆంధ్రప్రభ, న్యూయార్క్​ ప్రతినిధి)

GBU-72 Attack

హోర్ముజ్ జలసంధి నియంత్రణ కోసం అమెరికా GBU-72 బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ భూగర్భ క్షిపణి కేంద్రాలపై దాడి. ఆ మూడు ప్రధాన లక్ష్యాలు, దాడి వివరాలు, ప్రభావం పూర్తి విశ్లేషణ.ఇరాన్​ తో యుద్ధం అనవసరం..సైనికుల ప్రాణాలు పణంగా పెట్టినా..
అమెరికా ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం కాదు.. అంటూ అమెరికా నిఘా అధిపతి జో కేంట్​ రాజీనామాస్ట్రాన్ని సంధించినా.. ఇరాన్​ పై అమెరికా అధ్యక్షుడి దూకుడు ఆగలేదు.

GBU-72 Attack

హోర్ముజా జలసంధిని తమ ఆధీనంలో తీసుకోవటానికి.. భీకర యుద్ధం తప్పదని ఇరాన్​ కు ముచ్చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఒక్కడో.. పర్వతాల గర్భంలో దాచిన యురేనియం నిల్వలను నిర్వీర్యం చేయటం కష్టమని గ్రహించిన అమెరికా.. ఇరాన్​ బలం. బలగం నిర్వీర్యమే లక్ష్యంగా.. ఆకాశంలో చెలరేగిపోతోంది. సముద్రంలో దూసుకు పోతోంది. తాజాగా.. హోర్ముజ జలసంధిలోకి ప్రవేశించాలంటే.. ముందుగా ఇరాన్​ చేతిలోని అండర్‌గ్రౌండ్ యాంటీ – షిప్ క్రూయిజ్ మిస్సైల్ (anti-ship cruise missile) కేంద్రాలను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. వివరాల్లోకి వెళ్దాం.

GBU-72 Attack : హోర్ముజ్​ జలసంధి కోసం..

GBU-72 Attack

ఇరాన్ తీరప్రాంతంలోని లక్ష్యాలపై బహుళ (Multiple) GBU-72 రకానికి చెందిన 5,000 పౌండ్ల (సుమారు 2,268 కిలోలు) ‘బంకర్ బస్టర్’ బాంబులను ప్రయోగించింది. ఖచ్చితమైన సంఖ్యను CENTCOM వెల్లడించనప్పటికీ, ఇవి ఒకే సమయంలో వేర్వేరు భూగర్భ క్షిపణి కేంద్రాలపై ప్రయోగించినట్టు సమాచారం. ప్రధాన లక్ష్యాలు: హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలోని ఇరాన్ తీరంలో ఉన్న అండర్‌గ్రౌండ్ యాంటీ-షిప్ క్రూయిజ్ మిస్సైల్ (anti-ship cruise missile) కేంద్రాలను ఈ దాడుల్లో ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు.

GBU-72 Attack : ASCM సెంటర్లే టార్గెట్​

GBU-72 Attack

ఇరాన్ తీరంలోని వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి పరిసరాల్లోని భూగర్భ క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రధానంగా ఈ మూడు కేంద్రాలపై దాడులు జరిపింది. క్యూష్మ్ ద్వీపం (Qeshm Island)లోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఆధీనంలోని భూగర్భ యాంటీ – షిప్ క్షిపణి నిల్వలను GBU-72 బంకర్ బస్టర్లతో ధ్వంసం చేశారు.

GBU-72 Attack

ఇరాన్ ప్రధాన నావికాదళ స్థావరం బందర్ అబ్బాస్ (Bandar Abbas) సమీపంలో పర్వతాల లోపల నిర్మించిన క్షిపణి ప్రయోగ కేంద్రాలను (Missile Silos), కోహ్‌స్టాక్ (Kohstak) భూగర్భ సొరంగాల్లో దాచిన మొబైల్ క్షిపణి లాంచర్లపై దాడులు జరిగాయి.

GBU-72 Attack : బంకర్​ బ్లస్టర్ బాంబుల​ బోణీ

GBU-72 Attack

భారత కాలమానం (IST) ప్రకారం మార్చి 18 న ఉదయం 5:30 గంటల నుంచి 7:00 గంటల మధ్య ఈ దాడులు జరిగాయి. అమెరికా ప్రయోగించిన బంకర్ బస్టర్లు భూమిలోకి సుమారు 100 అడుగుల లోతుకు వెళ్లి పేలడంతో , ఆ భూగర్భ కేంద్రాల్లోని క్షిపణులు కూడా పేలిపోయాయి (Secondary explosions). ఆ కేంద్రాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి.

GBU-72 Attack

ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్‌లోని రామత్ గాన్ (Ramat Gan) ప్రాంతంపై క్లస్టర్ బాంబులతో క్షిపణులను ప్రయోగించింది. ఈ బంకర్ బస్టర్ బాంబులు భూమిలోపల, పర్వతాల్లోని కాంక్రీటు పొరల్లోకి చొచ్చుకుపోయి పేలడంతో అక్కడి ఇరాన్ క్షిపణి నిల్వలు, ప్రయోగ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు పెంటగాన్​ ప్రకటించింది. .అంతర్జాతీయ చమురు నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసి, ఇరాన్​ ముప్పును కొంతవరకు తగ్గించినట్లు అమెరికా పేర్కొంది.

GBU-72 Attack : ఆ 3 కేంద్రాలు మటాష్​

GBU-72 Attack

ఇరాన్ తీర ప్రాంతంలోని భూగర్భ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి అమెరికా GBU-72 అనే శక్తివంత ‘బంకర్ బస్టర్’ (Bunker Buster) బాంబులను ప్రయోగించింది. ఇరాన్ తన అత్యంత కీలక అణు కేంద్రాలు (ఉదాహరణకు ఫోర్డో – Fordow) క్షిపణి నిల్వలను పర్వతాల లోపల, దాదాపు 200 అడుగుల (60 మీటర్లు) లోతులో, గట్టి కాంక్రీటు గోడల మధ్య నిర్మించింది. సాధారణ బాంబులు వీటిని ఏమీ చేయలేవు. ఈ బంకర్ బస్టర్లు భూమిలోకి చొచ్చుకుపోయి, లోపల పేలడంతో అటువంటి పటిష్ట నిర్మాణాలను ధ్వంసం చేయగలవు.

GBU-72 Attack

హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే అంతర్జాతీయ చమురు రవాణా నౌకలకు ఇరాన్ చేతిలో యాంటీ-షిప్ క్షిపణులు ముప్పుగా మారాయి. ఈ క్షిపణులను దాచిన భూగర్భ స్థావరాలను నిర్వీర్యం చేయడానికి , భూగర్భంలోకి చొచ్చుకుపోయే మందుగుండు సామాగ్రిని (deep penetrator munitions) అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఉపయోగించింది, అమెరికా ఆధీనంలోని GBU-57 Massive Ordnance Penetrator (MOP) బాంబులు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి. వీటిని కేవలం B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ల తో మాత్రమే ప్రయోగించగలరు. ఇరాన్ అత్యంత కఠిన అణు కేంద్రాలను నాశనం చేయగల ఏకైక ఆయుధాలు ఇవేనని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ తన ప్రధాన ఆస్తులను భూమి లోపల దాచుకున్నప్పటికీ, అమెరికా వాటిని చేరుకోగలదని నిరూపించడం ద్వారా ఒక బలమైన హెచ్చరికను పంపడానికి ఈ బాంబులను ఎంచుకున్నారు.

GBU-72 Attack : ఈ బాంబు ఖర్చు ఎక్కువే…

GBU-72 Attack

ఈ రోజు ఇరాన్ పై అమెరికా ప్రయోగించిన GBU-72 ( 5,000 పౌండ్ల బరువు అంటే 2,268 కిలోలు ‘బంకర్ బస్టర్’ బాంబు తయారీ ఖర్చు, సామర్థ్యం వివరాలు తెలుసుకుందాం. అమెరికా రక్షణ శాఖ నివేదికల ప్రకారం, ఒక్కో GBU-72 బాంబు తయారీకి సుమారు $2,88,000 (సుమారు ₹2.4 కోట్లు) ఖర్చవుతుంది.

GBU-72 Attack

ఈ బాంబుల అభివృద్ధి, పరీక్షలకు అమెరికా ప్రభుత్వం దాదాపు $ 36 మిలియన్ల (సుమారు ₹300 కోట్లు) బడ్జెట్‌ను 125 యూనిట్ల కొనుగోలు కోసం కేటాయించింది. ఇతర బాంబులతో పోల్చితే అత్యంత భారీ బాంబు 30,000 పౌండ్ల GBU-57 (MOP) ధర ఒక్కొక్కటి దాదాపు $ 3.5 మిలియన్ల నుంచి $20 మిలియన్ల (సుమారు ₹30 కోట్లు – ₹160 కోట్లు) వరకు ఉంటుంది.

GBU-72 Attack

అమెరికా ఈ తరహా అత్యాధునిక ఆయుధాలను ఇతర దేశాలకు విక్రయించేటప్పుడు కేవలం తయారీ ఖర్చునే కాకుండా, శిక్షణ, నిర్వహణ, రవాణా ఖర్చులను కూడా కలుపుతుంది. అమెరికా తన మిత్రదేశాలకు (ఉదాహరణకు ఇజ్రాయెల్) విక్రయించేటప్పుడు ఒక్కో బాంబు ధర తయారీ ఖర్చు కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తుంది. చిన్న తరహా బంకర్ బస్టర్లు (910 కిలోల GBU-31) ఒక్కొక్కటి దాదాపు ₹58 లక్షల ($70,000) వరకు పలుకుతాయి. GBU-72 వంటి భారీ బాంబుల ఎగుమతి ధర దీనికంటే చాలా ఎక్కువగా ఉంటుంది.

GBU-72 Attack : విధ్వంస సామర్థ్యం

GBU-72 Attack

ఈ బాంబులు ఒక పెద్ద విస్తీర్ణాన్ని ధ్వంసం చేయడం కంటే, ఒక కచ్చిత బిందువు వద్ద లోతుగా చొచ్చుకుపోవడానికి రూపొందించారు. ఇవి భూమి లోపలికి సుమారు 150 అడుగుల (46 మీటర్లు) మట్టిని లేదా 15 నుంచి 20 అడుగుల (6 మీటర్ల) గట్టి కాంక్రీటును ఛేదించుకుని వెళ్ళగలవు.

GBU-72 Attack

ఇది నేరుగా తాకిన భవనం లేదా భూగర్భ బంకర్‌ను పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, పేలుడు సమయంలో వెలువడే ప్రకంపనలతో సుమారు 20 అంతస్తుల భవనం పరిమాణంలోని భూగర్భ నిర్మాణాలను మట్టితో సమాధి చేయగలదు. ఈ రకం బాంబులను అత్యంత సున్నిత సాంకేతికతగా పరిగణిస్తుంది, వీటిని కేవలం అత్యంత సన్నిహిత మిత్రదేశాలకు మాత్రమే అమెరికా విక్రయిస్తుంది.

Leave a Reply