America Political Tornado జో కెంట్ రాజీనామా Andhra Prabha Detail Report

America Political Tornado జో కెంట్ రాజీనామా Andhra Prabha Detail Report

  • అమెరికాలో కలవరం
  • ఇరాన్ యుద్ధంపై విభేదం
  • కెంట్ బలహీనుడు..
  • ట్రంప్ స‌ర్టిఫికెట్ ..
  • రిపబ్లికన్ పార్టీలోనూ అసంతృప్తి
  • అమెరికా కాంగ్రెస్ ఆగ్ర‌హం .. విచారణ డిమాండ్
  • దేశ‌వ్యాప్తంగా నిరసనలు..
  • యుద్ధ వ్యతిరేక స్వరాలు
  • నిఘా ప్రక్షాళనకు ట్రంప్ క‌స‌రత్తులు
  • ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం

( ఆంధ్ర‌ప్ర‌భ‌, న్యూయార్క్ ప్ర‌తినిధి )

America Political Tornado

అమెరికా ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ (గ్రీన్ బెరెట్) మాజీ అధికారి. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక నిఘా విభాగం అధిపతి జో కెంట్ రాజీనామా చేసి సంచ‌ల‌నం సృష్టించారు. అమెరికా రిప‌బ్లిక‌న్ పార్టీ స‌ర్కారులో క‌ల‌క‌లం రేపారు.
ఇరాన్‌తో యుద్ధం విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తన పదవికి రాజీనామా చేశారు. జో కెంట్ (Joe Kent). అమెరికా ‘నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్’ (NCTC) డైరెక్టర్‌గా పనిచేశారు. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న యుద్ధాన్ని తాను మనస్సాక్షిగా సమర్థించలేనని ఆయన ద‌న రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు.

America Political Tornado

ఇరాన్ నుంచి అమెరికాకు ఎటువంటి తక్షణ ముప్పు (Imminent threat) లేదని, కేవలం ఇజ్రాయెల్ , అమెరికాలోని శక్తివంత లాబీ ఒత్తిడి వల్లే ఈ యుద్ధం మొదలైందని ఆయన ఆరోపించారు. జో కెంట్ రాజీనామాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగానే స్పందించారు. ఆయన భద్రతా విషయాల్లో “చాలా బలహీనంగా” (Very weak on security) ఉన్నారని, ఆయన తప్పుకోవడం “మంచి విషయమే” అని అభివర్ణించారు. “ఇరాన్ ముప్పు కాదని భావించే వ్యక్తులు మాకు అవసరం లేదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

America Political Tornado : క‌ట్ట‌ప్ప దేశ భ‌క్తి …

నిజ‌.మే జో కెంట్‌.. క‌ట్ట‌ప్పే. దేశ‌భ‌క్తుడు. రాజ్యాధినేత త‌ప్ప‌టి అడుగుల‌తో ముందుకు పోతే .. దేశ ప్ర‌జ‌లు నాశ‌నం అవుతార‌ని భ‌య‌ప‌డిన రాజ్య భ‌క్తుడు. ఈ యుద్ధానికి అస‌లు కార‌ణం తెలుసుకున్న నిఘా శీలి. ఏం జ‌ర‌గ‌బోతుందో గ్ర‌హించిన యోధుడు. అందుకే ఈ యుద్ధంలో ఇరాన్ ను మ‌ట్టిక‌రిపించి అణ్మాయుధాల‌ను నిర్వీర్యం చేసి.. ప్ర‌ప్రంచ ఖ్యాతి సాధించి నోబెల్ శాంతి పుర‌స్కారాన్ని ముద్దాడాల‌ని అత్యాశ పెట్టుకున్న అమెరికా అధ్య‌క్షుడికి .. ఆది త‌ప్పు అని జోకెంట్ ఝ‌ల‌క్ ఇచ్చారు. ఎందుకంటే.. జో కెంట్ మాజీ గ్రీన్ బెరెట్ కమెండో , ట్రంప్‌కు గట్టి మద్దతుదారుడు. జూలై 2025లో ఈ కీలక పదవి బాధ్య‌త స్వీక‌రించారు. ఇరాన్ యుద్ధానికి నిరసనగా ట్రంప్ పరిపాలనలో రాజీనామా చేసిన తొలి సీనియర్ అధికారి ఈయనే. అధ్య‌క్షుడిని వ్య‌తిరేకించినందుకు దేశ‌ద్రోహి, రాజ‌ద్రోహి అనే బిరుదులు జో కెంట్ కు వెట్ హౌస్ ప్ర‌సాదించ‌టం స‌హ‌జ‌మ
జో కెంట్ లేఖలో ఆరోపణలన్నీ అవాస్తవాలని వైట్ హౌస్ స్పందిస్తూ, కొట్టిపారేసింది. అమెరికా ప్రయోజనాల కోసమే ఈ యుద్ధం జరుగుతోందని ప్రభుత్వం సమర్థించుకుంది. జో కెంట్ తన రాజీనామా లేఖలో చాలా తీవ్ర ఆరోపణలు చేశారు.

America Political Tornado

ఇరాన్ నుంచి అమెరికాకు తక్షణ ముప్పు ఉందనేది “తప్పుడు ఇంటెలిజెన్స్” (Faulty intelligence) నివేదిక‌. ఈ యుద్ధం అమెరికా ప్రజల రక్షణ కోసం కాకుండా, కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, విదేశీ శక్తుల ఒత్తిడి వల్ల జరుగుతోందని జో కెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. “నా మనస్సాక్షికి విరుద్ధంగా, ఒక అనవసర యుద్ధంలో అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెట్టే నిర్ణయాలకు మద్దతు ఇవ్వలేను” అని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదిక‌పై స్పందిస్తూ, జో కెంట్ ప్రభుత్వ వ్యతిరేక శక్తుల ప్రతినిధి (ఒక “Deep State Asset) అని ఆరోపించారు. . కెంట్ బలహీన వ్యూహకర్త అని, ఆయన స్థానంలో మరింత కఠిన నిర్ణయాలు తీసుకోగల వ్యక్తిని నియమిస్తామని ట్రంప్ ప్రకటించారు.

America Political Tornado : రిప‌బ్లిక‌న్ల‌లో.. అసంతృప్తి

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో జనవరి 2026 నుంచి అమెరికా నౌకలపై దాడులు జరగడం, ప్రతిగా ఇరాన్ లోని కొన్ని ప్రాంతాలపై అమెరికా బాంబు దాడులు చేయడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. రాజకీయ చీలిక: రిపబ్లికన్ పార్టీలోనే జో కెంట్ రాజీనామా కలకలం రేపింది. కొందరు ఆయనను “దేశద్రోహి”గా అభివర్ణిస్తుంటే, మరికొందరు యుద్ధం వల్ల కలిగే నష్టాలను ఆయన ముందే గుర్తించారని సమర్థిస్తున్నారు. ఇటీవ‌ల రిప‌బ్లిక‌న్ స‌బావేశంలో అధ్మ‌క్షుడు ట్రంప్ మాట్లాడుతూ, యుద్ధంలో గెలిచాం, కానీ త‌గిన ష‌లితం రాలేద‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఆ క్ష‌ణంలోనే రిప‌బ్లిక‌న్ ల‌లో అసంతృప్తి ర‌గిలింద‌ని మీడియాలో ప్రచారం జ‌రిగింది. తాజాగా జో కెంట్ రాజీనామాతో.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై అనేక వ్య‌తిరేక అంచ‌నాలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. నోబెల్ బ‌హుమ‌తి మాటేమోగానీ.. ఈ సారి ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్లు పెట్టేబేడా స‌ర్థుకోక త‌ప్ప‌ద‌ని అమెరిక‌న్లు సెటైర్లు గుమ్మ‌రిస్తున్నారు.

America Political Tornado : హూ ఈజ్ జో కెంట్ ?

America Political Tornado

ఆయన ఒక మాజీ Special Forces (Green Beret) అధికారి. ఆయన భార్య షానన్ కెంట్ 2019లో సిరియాలో జరిగిన బాంబు దాడిలో మరణించిన ఇంటెలిజెన్స్ అధికారి. ఈ నేపథ్యంతో సైనికుల ప్రాణాల పట్ల ఆయనకు ఉన్న ఆందోళనను చాలామంది అర్థం చేసుకుంటున్నారు. ఇరాన్ తో యుద్ధంపై, ఇంటిలెన్స్ ఆఫీస‌ర్ జో కెంట్ ఆరోపణలపై విచారణ జరపాలని అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్)డిమాండ్ చేస్తోంది.

America Political Tornado : అమెరికాలో దుమారం

America Political Tornado

జో కెంట్ తన రాజీనామా లేఖలో వ్యాఖ్యలు అమెరికా పార్లమెంట్ (Congress) లో పెద్ద దుమారం రేపాయి . ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్‌లో ప్రతిపక్ష డెమొక్రాట్లు యుద్ధానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. యుద్ధం ప్రారంభించడానికి ప్రభుత్వం చూపిన ఆధారాలు (Intelligence Reports) అసలైనవా కాదా అని తేల్చడానికి ఒక స్వతంత్ర కమిషన్ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కెంట్ రాజీనామా తర్వాత అమెరికాలోని ప్రధాన నగరాల్లో “యుద్ధాన్ని ఆపండి” (Stop the War) అంటూ నిరసనలు పెరిగాయి. అమెరికాలోని ఈ అంతర్గత గందరగోళాన్ని ఇరాన్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. “అమెరికా అధికారులే ఈ యుద్ధం అబద్ధమని ఒప్పుకుంటున్నారు” అని ఇరాన్ విదేశాంగ మంత్రి అంతర్జాతీయ వేదికలపై ప్రచారం చేస్తున్నారు.

America Political Tornado : ప్ర‌క్షాళ‌న దిశ‌గా..

America Political Tornado

జో కెంట్ రాజీనామా తర్వాత, ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాల‌ దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. NCTC డైరెక్టర్‌గా జో కెంట్ స్థానంలో ఒక సీనియర్ మిలిటరీ అధికారిని తాత్కాలికంగా (Acting Director) నియమించినట్లు తెలుస్తోంది. ఇరాన్ పట్ల రాజీలేని ధోరణి కలిగిన వ్యక్తిని శాశ్వత డైరెక్టరుగా నియమించే అవకాశం ఉంది. యుద్ధాన్ని వ్యతిరేకించే, సందేహించే ఇతర అధికారులపై కూడా నిఘా పెంచాలని, అవసరమైతే ఆ అధికారులను పదవుల నుంచి తొలగించాలని వైట్ హౌస్ ఆదేశించినట్లు సమాచారం. “ఇంటెలిజెన్స్ ప్రక్షాళన షురూ అయిన‌ట్టు అధికారులు భావిస్తున్నారు. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (NCTC) డైరెక్టర్‌గా జో కెంట్ స్థానంలో కొత్త అధికారిని నియమించే ప్రక్రియపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఒక పేరును ఖరారు చేయలేదు. అయితే, ట్రంప్ తన వ్యాఖ్యల్లో “కెంట్ లాగా బలహీనంగా కాకుండా, కఠినంగా వ్యవహరించే వ్యక్తులు మాకు కావాలి” అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ విభాగం తాత్కాలిక అధికారుల పర్యవేక్షణలో ఉండవచ్చు

America Political Tornado : ఇరాన్ తో స‌మ‌ర‌మే

America Political Tornado

జో కెంట్ రాజీనామా చేసినప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది . యుద్ధం మొదలైన రెండు వారాల తర్వాత, ఒక భారీ యుద్ధనౌకలో అదనంగా 2,500 మంది మెరైన్ సైనికులను పశ్చిమ ఆసియాకు అమెరికా తరలించింది. ముఖ్య లక్ష్యాలపై దాడులు: ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖార్గ్ ద్వీపం (Kharg Island) లోని సైనిక లక్ష్యాలను అమెరికా దళాలు ధ్వంసం చేశాయని, తదుపరి లక్ష్యం అక్కడి చమురు మౌలిక సదుపాయాలేనని ట్రంప్ హెచ్చరించారు. క్షిపణి దాడులతో పాటు, ఇరాన్ లోని విద్యుత్ గ్రిడ్లు చమురు శుద్ధి కర్మాగారాలపై అమెరికా సైబర్ దళాలు భారీగా దాడులు ప్రారంభించాయి. పర్షియన్ గల్ఫ్ నుంచి ఇరాన్ చమురును రవాణా చేసే నౌకలను పూర్తిగా అడ్డుకోవాలని అమెరికా నౌకాదళం భావిస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.

ALSO READ : Isreal Target 2 Heads : ఇరాన్​ అగ్ర నేతలు ఖతం Andhra Prabha Detail Report

Leave a Reply