నిధులు నేడు విడుదల..

నిధులు నేడు విడుదల..

రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఇమాములు మౌజన్ లకు రూ. 45 కోట్లు గౌరవ వేతనం విడుదల…
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఇమామ్, మౌజన్లకు రంజాన్ సందర్భంగా రెండు రోజుల ముందే ప్రభుత్వము శుభవార్త చెప్పింది. రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం నిమిత్తం రూ.45 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం తెలిపారు. ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిధుల విడుదలకు ఆదేశలు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువటం విశేషం.

సీఎం ఆదేశించిన వెంటనే రాత్రే జీవో జారీ చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్. రాష్ట్రంలోని ఇమామ్ లకు మౌజాన్ లా కు ఒకేసారి గత ఆరు నెలల బకాయిలను రంజాన్ సందర్భంగా ఒకేసారి క్లియర్ చేసిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 10 వెల మంది ఇమామ్‌లు, మౌజన్‌ల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానున్నట్లు పేర్కొన్న రు.5 వెల మంది ఇమామ్‌లకు ఆరు నెలల వేతనం కింద రూ.30 కోట్ల చెల్లింపులకు మార్గం సుగమం చేశారు.5 వెల మంది మౌజన్లకు ఆరు నెలల వేతనం కింద రూ.15 కోట్లు జమకు శ్రీకారం చుట్టారు. రంజాన్ పండుగ అందరిని ఈ నిధులు జమ కావటంతో వారు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply