ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలతో పట్టణాభివృద్ధి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలతో పట్టణాభివృద్ధి
మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న
10,12 వార్డులలో ర్యాలీ..వార్డ్ కార్యాలయం ప్రారంభం
కాలని వాసులు, అధికారులతో కలిసి ప్రజాప్రతినిధుల ప్రతిజ్ఞ
మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలతో మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న లు అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని 10,12 వ వార్డ్ ల లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా ఆయా వార్డులలో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన సమావేశంలో కాలని వాసులు,అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ స్వప్న,వైస్ చైర్మన్ వెంకన్న లు స్థానిక కౌన్సిలర్లు నల్ల మధు, మెంట రమణ నగేష్ తో కలిసి ఆయా వార్డులకు సంబంధించిన కార్యాలయాలను ప్రారంభించారు. వార్డులోని పలు సమస్యల పై చర్చించి పారిశుద్ధ్య, నీటి సమస్య, దోమల బెడద,నూతన మోరీల ఏర్పాటు విషయం,క్ రోడ్డు ల నిర్మాణం, విధి లైట్ల ఏర్పాటు, కోతులను నివారించడానికి చేసే విధానం పై వార్డు ప్రజల కు వివరించారు. అదే విధంగా పెండింగ్ పైల్స్ విషయం, ఇందిరమ్మ ఇండ్లు, రోడ్డు భద్రత కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో 2,5,11 వ వార్డ్ కౌన్సిలర్లు కూర్మిళ్ల ప్రమీల రాములు,మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి, కారుపోతుల వెంకన్న, మున్సిపల్ కమిషనర్ సతీష్, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్ , మున్సిపల్ ,మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
