క్రికెట్ బెట్టింగ్ నిర్వహకులపై పోలీసుల దాడి

క్రికెట్ బెట్టింగ్ నిర్వహకులపై పోలీసుల దాడి

గుడివాడలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నదుండగులు
నిర్వహకులపై పోలీసులు దాడి.. ఐదుగురు వ్యక్తులు అరెస్ట్

గుడివాడ, ఆంధ్రప్రభ: గుడివాడ మండలం మల్లాయపాలెం పంచాయతీ పరిధిలోని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. రహస్య సమాచారం అందడంతో గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ SI చంటిబాబు సిబ్బందితో దాడి నిర్వహించారు. దాడి సమయంలో అక్కడ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉన్న 5 మంది వ్యక్తులను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. నిందుతుల నుంచి రూ.1,05,000/-నగదు, 8 మొబైల్ ఫోన్లు, బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ /ఫోన్ఏ స్క్రీన్ షాట్లు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ చేయబడిన ముద్దాయిల వివరాలు:

A-1 కలిపిండి శివ @ మసాలా శివ, తండ్రి పేరు రాంబాబు, వయసు 36 సంవత్సరాలు, కులం కొప్పుల వెలమ, కాకతీయ నగర్, 3వ లైన్, గుడివాడ.
A-2 నూకారపు భాను ప్రసాద్, తండ్రి పేరు అప్పారావు, వయసు 42 సంవత్సరాలు, కులం కొప్పుల వెలమ, నీలామహల్ రోడ్డు, గుడివాడ.
A-3 మండాది కనక మహేష్, తండ్రి పేరు పాపినాయుడు, వయసు 37 సంవత్సరాలు, కులం కొప్పుల వెలమ, బేతవోలు, గుడివాడ,
A-4 బోయిన కృష్ణ అజయ్ బాబు, తండ్రి పేరు వెంకటేశ్వరరావు, వయసు 36 సంవత్సరాలు, కులం కాపు, వలివర్తిపాడు పంచాయతీ, గుడివాడ మండలం.
A-5 మామిడి కిరణ్ @ వంశీ కిరణ్, తండ్రి పేరు వెంకట రమణ, వయసు 36 సంవత్సరాలు, కులం కళింగ, మండవల్లి మండలం, ఏలూరు జిల్లా.

ఈ కేసులో ఇప్పటివరకు లభించిన సాక్ష్యాధారాలు ద్వారా మొత్తం 17 మంది ముద్దాయిలను గుర్తించటం జరిగింది. వారిలో A-1 నుండి A-5 వరకు ముద్దాయిలను అరెస్ట్ చేయటం అయినది. ఇందులో పాత్ర ఉన్న మరో 92 మంది ముద్దాయిలను త్వరలోనే అరెస్ట్ చేయటం జరుగుతుంది సీజ్ చేయబడిన మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ అనాలసిస్కు పంపించి, అందులోని డేటా మరియు డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి, అందులో వచ్చిన వివరాల ఆధారంగా ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన వారందరిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో సమర్ధవంతంగా పని చేసిన తాలూకా SI నంబూరి చంటి బాబు గారిని, ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు రివార్డ్ తో అభినందించారు.

Leave a Reply