సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం..

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ ; అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు శనివారం మహిళామూర్తులను ఘనంగా సత్కరించారు చేశారు. అనంతరం జడ్జి ధీరజ్ కుమార్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. మహిళా సిబ్బందికి మహిళా న్యాయవాదులను శాలువాతో సత్కరించారు.

చట్టపరమైన అవగాహన: మహిళలు తమకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు. గౌరవం , సమానత్వం: మహిళలకు గౌరవం లభించిన చోటే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ మహిళల పట్ల మర్యాదతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ గణపురం. రామకృష్ణ అడ్వకేట్ ఐలోని, కుమార్ మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply