విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్ పంపిణీ..

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని బాలుర అశ్రమో న్నత పాఠశాలలో
పదవ తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులను వెడ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఆ ఫౌండేషన్ డైరెక్టర్ మెస్రం నగేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెడ్మ ఫౌండేషన్ వ్యవస్థాప అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ప్యాడ్స్ , పెన్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు.

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కూడ ఇదే పాఠశాలలో చదువుకున్నారని విద్యార్థులకు గుర్తు చేశారని ఆయన పేర్కొన్నారు, ఈ పాఠశాల విద్యార్థులు పరీక్షలను నిర్భయంగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం విబిపి సభ్యులు పరమేశ్వర్ , రాజ్ కుమార్ , సల్మాన్ , నందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply