జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

  • చాగల్లు గ్రామంలో బైక్ ను ఢికొన్న కారు
  • ఇద్దరికీ తీవ్ర గాయాలు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంజరిగింది. జనగామ నుంచి వరంగల్ వైపున హైదరాబాద్‌కు చెందిన టిఎస్08ఎఫ్ కె 5329 నెంబర్ గల కారు వెనుక నుంచి ఏపీ24ఎహెచ్7230 నెంబర్ గల బైకు ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న జఫర్‌గడ్ మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన మంద పూరి సంపత్, తాటికాయల సంపత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదా న్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందిం చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.

Leave a Reply