మా గ్రామాలకు నిధులు లేవా..?

మా గ్రామాలకు నిధులు లేవా..?
- కొన్ని గ్రామాలకే నిధులా..?
- ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల్లో సమానత్వం లేదు
- నిధుల కేటాయింపుపై బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల అసంతృప్తి
- మా గ్రామాలకూ నిధులు ఇవ్వాలి
- స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సర్పంచ్‌ల వినతి
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు మాత్రమే ఎన్‌ఆర్‌ఈ జీఎస్ 2025–2026 ఆర్థిక సంవత్సరానికి నిధులు మంజూరు చేయ డం పట్ల బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జిట్టాగూడెం, రాఘవపూర్, సము ద్రాల, అక్కపల్లి గూడెం గ్రామాల సర్పంచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాలకే నిధులు మంజూరు చేయడం సరైంది కాదు.. మా గ్రామా లకు నిధులు లేవా అంటూ వారు ప్రశ్నించారు.
నిధుల కేటాయింపులో అన్ని గ్రామాలకు సమానత్వం ఉండాలి. అభివృద్ధి పను ల కోసం తమ గ్రామాలకు కూడా నిధులు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఈ సందర్బంగా గురువారం వారు విలేకరులతో మాట్లా డుతూ…మండల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయ డం అభినందనీయమని తెలిపారు. తమ గ్రామాలు కూడా అభివృద్ధి పరంగా పలు అవసరాలు ఉన్న గ్రామాలేనని తెలిపారు.
మండలంలోని మీదికొండ, కొత్తపల్లి, పాంనూర్, తానేదర్‌పల్లి, విశ్వనాధ్‌పూర్, రంగా రాయిగూడెం, కోమటిగూడెం గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున, తాటి కొండ గ్రామానికి రూ.30లక్షలుగా మొత్తం కోటి రూపాయల ఎన్‌ఆర్‌ఈ జీఎస్ నిధులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంజూరు చేయడం మంచి విషయమని పేర్కొన్నారు.
అయితే మండలంలో కొత్తగా ఏర్పడిన జిట్టా గూడెం గ్రామంతో పాటు రాఘవపూర్, సముద్రాల, అక్కపల్లి గూడెం గ్రామాల్లో రహదారులు, కాలువలు, చెరువుల మరమ్మతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పలు పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందువల్ల తమ గ్రామాలకు కూడా ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టేలా చూడాలని ఎమ్మె ల్యే కడియం శ్రీహరిని కోరారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామా లు సమానంగా అభివృద్ధి చెందేలా నిధులను సమానంగా కేటాయించాలని బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు విజ్ఞప్తి చేశారు.
