ఆలేరులో ఇంటర్ పరీక్షా కేంద్రాల తనిఖీ..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను గురువారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. పరీక్షా కేంద్ర నిర్వాహకులతో మాట్లాడి పరీక్షా నిర్వహణను గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన తాగునీటి, వైద్య సౌకర్యం గురించి కూడా అడిగారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని అన్నారు.
ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలను రాసేలా చూడాలని చెప్పారు. పరీక్షల్లో ఎలాంటి కాపీయింగ్ లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని అన్నారు. జవాబు పత్రాల రవాణాకు నటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. పరీక్షలు పూర్తి అయ్యేవరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ వలిగొండ అంజనేయులు, ఆయా పరీక్ష కేంద్రాల సూపరిండెంట్లు కలెక్టర్ వెంట ఉన్నారు.
