బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కౌన్సిలర్ పూర్ణ చారి

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతురాలి కుటుంబాన్ని 9వ వార్డు బిజెపి కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి పరామర్శించారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన యాట నాగరాణి (ముదిరాజ్) అనే మహిళ అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు. ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండగా.. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో స్థానిక 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి గురువారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందజేశారు. చిన్నపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, బీజేపీ నాయకులు దార్నా నారాయణదాసు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
