Toll free 1098 | బాలికలు బహు పరాక్…

Toll free 1098 | బాలికలు బహు పరాక్…
శక్తి టీం బృందాలచే బాలికలకు అవగాహన..
Toll free 1098 | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ సునీల్ షేరణ్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లోనూ కళాశాలలోనూ బాలికల్లో గ్రూప్ టచ్ బ్యాట్ టచ్ పైన అవగాహన కల్పించేందుకు శక్తి టీమ్లను బృందాలుగా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు గురువారం జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్నీ స్కూల్లలో, కాలేజీలలో మహిళలపై నేరాలు , బాల్య వివాహాల నిరోధం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ పై నియంత్రణ, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు సబ్ డివిజన్ ఏ ఎస్ పి ఎం.జావళి సూచనలతో శక్తి టీం సిబ్బంది అన్ని ప్రాంతాల్లోని బాలికలను మహిళలను చైతన్యం చేస్తున్నారు. జిల్లా పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లోని కళాశాలలకు పాఠశాలకు వెళ్లి విద్యార్థినిలకు శక్తి యాప్ గురించి వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా తెలియజస్తు ఉన్నారు.

మీతో పాటు మీ తల్లిదండ్రులకు శక్తి యాప్ గురించి తెలియజేసి వారి సెల్ ఫోన్ లలో రిజిస్టేషన్ చేసుకునేలా చూడాలని వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో జరిగే సైబర్ క్రైమ్ నేరాల గురించి వివరించి ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చఅన్నారు. బాల్య వివాహాలు, మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలగురించి అవగాహన కల్పించరు.వాటికి సంబందించిన టోల్ ఫ్రీ నెంబర్ 1098 గురించి విద్యార్థులకు ఉపయోగాలను వివరించారు.
Toll free 1098 | అత్యవసర సమయంలో…
ఆపద సమయంలో అమ్మాయిలు శక్తి యాప్ సెల్ నంబర్ 7993485111 కు ఫోన్ చేసినచో తక్షణమే స్పందిస్తారని శక్తి టీం బృందాల అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లాలో గల వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి శక్తి టీముల పనితీరును వివరించడంతో పాటు అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 100 గురించి విషదంగా విద్యార్థులకు వివరించారు.
మీరు బాధ్యతగల పౌరులుగా ఎదగాలని, విద్యతో పాటు మంచి నైతిక విలువలను లవర్చుకోవాలన్నారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించగల సామర్థ్యం కలవారని, ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళా అధ్యాపకులు టీచర్లు బాలికలను చైతన్యవంతుడు చేయాలని వారు సమాజంలో జరుగుతున్న సంఘటనలకు పోరాట శక్తిని పటిమను అలవర్చాలని సూచించారు.
