హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

  • రంగుల్లా, మన జీవితాలు కూడా ఆనందంతో.. ఐక్యతతో నిండిపోవాలి
  • ద్వేషాలను దూరం చేసి ప్రేమ, సఖ్యతను పెంపొందించేది పండుగలు
  • హోలీ పండుగలో ఉత్సాహంగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్

నిజామాబాద్,ఆంధ్రప్రభ : రంగుల్లా మన జీవితాలు కూడా ఆనందంతో, ఐక్య తతో నిండిపోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.హోలీ పండుగ మన భారతీయ సం స్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. ఈ పండుగ ద్వేషాలను దూరం చేసి ప్రేమ, సఖ్యత, సౌభ్రా తృత్వాన్ని పెంపొందిస్తుం దన్నారు. బుధవారం నగరంలో హోలీ పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ప్రజలతో కలిసి ఉత్సా హంగా జరుపుకున్నారు.


భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బిజెపి నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం 34వ డివిజన్‌లోని కుమార్ గల్లీలో మున్సిపల్ కార్మికు లతో కలిసి హోలీ సంబ రాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూనగర పరిశుభ్రత కోసం కష్టపడు తున్న మున్సిపల్ కార్మికులు నిజమైన సేవాధారులు. వారి కృషి వల్లనే నగరం పరిశుభ్రంగా ఉంటుంది. వారి సంక్షేమం కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని తెలిపారు.


నగరంలోని కిసాన్ గంజిలో గల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ఆర్య వైశ్యులు నాయకులు అందరితో కలిసి సంబురంగా వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ పండుగలు సమాజంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర బంధాలను బలపరుస్తాయి. సమాజ అభివృద్ధికి ప్రతి వర్గం సహకారం అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్ర మాల్లో స్థానిక ప్రజాప్ర తినిధులు, పార్టీ నాయ కులు, కార్పొరేట ర్లు,కార్య కర్తలు, సంఘ సభ్యుల పాల్గొన్నారు.

Leave a Reply