అయ్యప్ప ఆలయంలో తిరు నక్షత్ర పూజలు..!

అయ్యప్ప ఆలయంలో తిరు నక్షత్ర పూజలు..!

కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు అయ్యప్పస్వామి దేవాలయం వద్ద స్వామివారి తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు గణపతి,షణ్ముఖ,మాలికాపు రత్తమ్మ ఆవాహిత దేవతలకు హోమములు జరుపుతున్నారు. అనంతరం స్వామి వారి మూలవిరాట్ కు పంచామృత అభిషేకం, భక్తులచే 108 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మ కర్త బడే భావనారాయణ తెలిపారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశామని తెలిపారు.

Leave a Reply