ఘనంగా హోలీ సంబరాలు..

ఘనంగా హోలీ సంబరాలు..
కడెం ( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కడెంతో పాటు మండలంలోని కన్నాపూర్ కొండుకూర్, బెల్లాల్, పెద్దూర్, మద్దిపడగ పాండవ పూర్, చిట్యాల్, అంబారి పేట్, ధర్మాజీపేట్ తదితర గ్రామాలలో చిన్న పిల్లలు, యువకులు, ఉద్యోగులు అంతా కలిసి హోలీ సంబరాలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో కామ దహనం తర్వాత వచ్చే హోలీ పండుగను చిన్నా పెద్ద అంతా కలిసి కులమత బేధాలు లేకుండా ఒకరి పై ఒకరు ప్రేమ ఆప్యాయతో రంగులు చల్లుకుంటూ కేరింతలతో జరుపుకునే గొప్ప పండుగ హోలీ.
అలాగే పిల్లలతో పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఈ హోలీని జరుపుకున్నారు. మండల కేంద్రమైన కడెంలో జరిగిన హోలీ దినోత్సవ వేడుకల్లో కడం పి ఎస్ ఎస్ ఐ పి సాయి కిరణ్, పెద్దూరు కడం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, రామాలయం కమిటీ చైర్మన్ గడప దేవరాజ్, జిపి వార్డు సభ్యులు, పలువురు ఉద్యోగులు, నాయకులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
