చంద్రగ్రహణం కారణంగా హోలీ తేదీ మార్పు

నార్సింగి, ఆంధ్రప్రభ ; గ్రామ ప్రజలకు పురోహితులు పుల్యాకుల శ్రీనివాస్ శర్మ మరియు సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ ముఖ్య ప్రకటన విడుదల చేశారు. 2026 మార్చి 2వ తేదీ సోమవారం రోజున కామదహనం నిర్వహించబడుతుందని తెలిపారు. అయితే మార్చి 3వ తేదీ మంగళవారం రోజు చంద్రగ్రహణం ఉన్నందున హోలీ పండుగను మార్చి 4వ తేదీ బుధవారం జరుపుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి శోభాయాత్రను గ్రామంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని గౌరవించి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.

Leave a Reply