పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి…

పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి…

లో హోల్టేజ్ సమస్య తీరుతుంది…

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాల్టీలో గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చైర్ పర్సన్ శ్రీలక్ష్మి రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేదర్ లు పేర్కొన్నారు. వార్డు కౌన్సిలర్ తో కలిసి ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, గంధం నరేందర్ లు సోమవారం పలు వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 17వ కౌన్సిలర్ సలావుద్దీన్ అయూబ్ ఖాన్ తో కలిసి నేడు పర్యటించినట్లు తెలిపారు. ఉదయం 17వ వార్డు తోపాటు 9వ వార్డులో అధికారులతో కలిసి పర్యటించడం జరిగిందన్నారు.

వార్డుల్లో పర్యటిస్తున్నప్పుడు తమ దృష్టికి ప్రతి సమస్యను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వార్డులను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. అదే విధంగా 17వ వార్డులో స్థానిక కౌన్సిలరు అయూబ్ ఖాన్ తో వార్డులో పర్య టిస్తున్నప్పుడు త‌న దృష్టికి తీసుకువచ్చి ప్రతి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

17వ వార్డు, 9వ వార్డుల్లో అవసరమైన సీసీ రోడ్డు, సైడు కాలువల నిర్మాణ పనులు చేపట్టి, నీటి సమస్య, పారిశుద్ధ పనులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వార్డులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అర్హులందరికీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందించే పథకాలు అందిస్తామన్నారు. అధికారులకు, సిబ్బందికి వార్డుల్లో ఎక్కడ సమస్య ఉన్న వెంటనే స్పందించి తమ దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారికి సూచించారు.

నూతన ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించిన ఛైర్ పర్సన్…

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకపేట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ ను నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా ప్రారంభిం చారు. ఈ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుతో లో హోల్టేజ్ సమస్యతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు.

దీనిని ప్రజలు విని యోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి సందీప్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాదాసి రవి, శ్రీరామోజు రోజా రాణి, పొన్నాల మనిషా ప్రకాష్, ఏఈ నీలం విజయ్ భాస్కర్, లైన్ ఇన్స్పెక్టర్ మేడి రాధిక, వార్డు ఆఫీసర్లు కాట శ్రీనివాస్, జూలూరి కావ్య, వాటర్ సప్లై కొల్లూరి రంజిత్, వార్డు జవాన్ మాదాసి భరత్, మాజీ కౌన్సిలరు మేర్గు సాంబయ్య, మాజీ ఎంపీటీసీ పేరం బాబు రావు, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్ భాయ్, 9వ వార్డు అధ్యక్షులు గిరగాని రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల వీరస్వామి, మేరుగు కిరణ్, ఆకుల శ్రీను, దండు నవీన్, బండారు శివ, నామాసు వెంకటేశ్వర్లు, సల్మాన్, సాయి, మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply