జాతీయస్థాయిలో ఊరు పేరును నిలపాలి…

జాతీయస్థాయిలో ఊరు పేరును నిలపాలి…

క్రీడలు మానసిక ఉల్లాసనికి దోహదం

  • గ్రామ సర్పంచ్ రజిత పరశురామ్

జగదేవపూర్, ఆంధ్రప్రభ : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, తిగుల్ పేరును జాతీయస్థాయిలో మారు మోగేలా యువత క్రీడల్లో రాణించాలని గజ్వేల్ న్యూరో వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రజిత పరుశురాం అన్నారు. తిగుల్ స్పోర్ట్స్ క్లబ్, గజ్వేల్ న్యూరో సంయుక్త ఆధ్వర్యంలో జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించారు. ముందుగా సర్పంచ్ రజిత పరుశురాం, గజ్వేల్ న్యూరో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఎం. డి భానుచందర్ క్రీడాజ్యోతి వెలిగించారు. క్రీడా పోటీలకు జిల్లాలోని వివిధ గ్రామాల నుండి మొత్తం 46 టీమ్ లు హాజరయ్యాయి.

వాలీబాల్ క్రీడా పోటీల్లో ప్రథమ స్థానంలో గజ్వేల్ న్యూరో తీగుల్ వాలీబాల్ జట్టు నిలువగా, ద్వితీయ స్థానంలో అహ్మదిపూర్ వాలీబాల్ జట్టు నిలిచింది. క్రీడా పోటీలో గెలిచిన వారి గెలిచిన జట్లకు ప్రథమ బహుమతిగా రూ. 15000 నగదు, ద్వితీయ బహుమతిగా రూ. 10,000 నగదు తోపాటు షీల్డ్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడ‌లకు తిగుల్ గ్రామం పుట్టినిల్లు అని, ఎంతో మందిని క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత గ్రామానికి ఉందన్నారు. నేటి యువత స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసి మళ్లీ క్రిడలో గ్రామానికి పూర్వ వైభవం తీసుకరావడం గొప్ప విషయమన్నారు.

యువత చెడు వ్య‌సనాలకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. అలాగే క్రీడాల వల్ల యువత మధ్య స్వేహ భావం ఏర్పడుతుందన్నారు. క్రీడాలకు ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పిఏసిఎస్ మాజీ డైరెక్టర్ భూమయ్య, పి ఈ టి రాజిరెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, ఎల్లయ్య, భానుప్రకాష్ రావు, బిక్షపతి, రామచంద్రారెడ్డి, వివిధ పార్టీల నాయకులు కృష్ణ మూర్తి, దయానంద్ రెడ్డి, అశోక్, ఎల్లారెడ్డి, మల్లేశం, మహేష్, కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్, ఐలయ్య, ఉపాధ్యాయులు శంకర్, నరేష్, జర్నలిస్ట్ లు రాంప్రసాద్ రావు, చిన్ని కృష్ణ, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, కార్యదర్శి కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply