ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువ అనడం సరికాదు..

ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువ అనడం సరికాదు..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దుటలో కీలకపాత్ర పోషిస్తున్నది ఉపాధ్యాయులే అని భూపాలపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు ఆరే రాకేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చి రాములు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ విద్యా విధానం 2026 నివేదికలో విద్యా కమిషన్ తమ పరిధి దాటి ఉపాధ్యాయుల వేతనాల గురించి ప్రమోషన్ల గురించి నియమాలకు గురించి మాట్లాడడం ఉపాధ్యాయుల ఆత్మ గౌరవాన్ని భంగపరిచే విధంగా ఉందన్నారు. అసహనాన్ని తెలుపుతూ మదింపు అనేది విద్య గణాంకాల ఆధారంగా చేయడం వల్ల విద్యారంగంలోని అనారోగ్యకరమైన పోటీ పరిస్థితి నెలకొంటున్నాయని అన్నారు.

ఈ విధమైన పని తీరు వద్దని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, నలుగురు ఉపాధ్యాయులు ఉండాలని డిజిటల్ విద్య ఆర్టిఫిషల్ లెర్నింగ్ విద్య పాఠశాలలు, మౌలిక వసతులు, వృత్తి విద్య క్రీడా విద్య మొదలైన వాటిని విద్యావ్యవస్థను నిర్మిస్తూ విద్యార్థి సమగ్ర వికాస అభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యా విధానం నివేదిక ఉండాలని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే నియమాకాలు కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకురావడం అప్రెంటిషిప్ విధానం కొనసాగించడం రెగ్యులర్ నియామకాలు వద్దని చెప్పడం.. ఈ విషయాలు అటు నిరుద్యోగులను ఇటు ఉపాధ్యాయులను అవమాన పరిచే విధంగా ఉన్నాయని అన్నారు. కొన్ని అంశాలను చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే ఈ నివేదిక పలుమార్పులతో విద్యారంగా నిపుణులు సూచనలు తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు.

Leave a Reply