బ్రహ్మోత్సవాలకు చల్లమల్ల కృష్ణారెడ్డికి ఆహ్వానం..

బ్రహ్మోత్సవాలకు చల్లమల్ల కృష్ణారెడ్డికి ఆహ్వానం..
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చల్లమల్ల కృష్ణారెడ్డిని మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్ ఆహ్వానించారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను ఆయనకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చండూరు మండల నాయకుడు పాలకూరి నాగరాజు గౌడ్,పెద్ద అంబర్‌పేట్ ఇసుక లారీ యూనియన్ ఉపాధ్యక్షుడు మునుకుంట్ల బలరాం గౌడ్,మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్,జాజుల ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
