చిన్నారులు వంద శాతం హాజరయ్యేలా చర్యలు చేపట్టాలి

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు వంద శాతం హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని సీడీపీఓ ఇందిరా అన్నారు. కొమరం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల కేంద్రంలో అన్ని గ్రామాల అంగన్‌వాడీ టీచర్లకు నెలవారి సమావేశం నిర్వహించారు.సమావేశానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ ఇందిరా పాల్గొని మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలు వంద శాతం హాజరు ఉండాలన్నారు.

ఫుడ్ స్టాక్, గుడ్లు ఎక్స్ పైరీ తేదీలు తప్పని సరిగా చెక్ చేసుకొన్న తర్వాత బయోమెట్రిక్ వేసి ఫుడ్ స్టాక్ తీసుకోవాలన్నారు. గుడ్లు సరఫరా అయిన 10 రోజుల్లోగా ఉపయోగించాలని ఆదేశించారు. అదేవిధంగా వేసవి కాలంలోతీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలన్నారు.పిల్లలకు ఆటపాటలతో పాటు సృజనాత్మక పెంపొందించే విధంగా విద్యాబోధన అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సోంబాయి, అంగనవాడి టీచర్ చంద్రకళ, జాదవ్ దేవిక, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Leave a Reply