ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం నాగారం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గురువారం రోజు నాగారం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు కీ॥శే॥ ఇట్టబోయినసమ్మయ్య 10వ వర్ధంతి సందర్భంగా జడ్పీహెచ్ఎస్ నాగారం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షల కోసం పరీక్ష ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
పరీక్ష ప్యాడ్ల దాత ఇట్టబోయినసమ్మయ్య వారి ముని మనువలు ఇట్టబోయిన ప్రమోద్, సాయివర్షిత్, సాకేత్, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగారం గ్రామ జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
