ప్రమాదంలో మహిళ మృతి

ప్రమాదంలో మహిళ మృతి
క్యాతన్ పల్లి,ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ పట్టణం లోని భగత్ సింగ్ నగర్ లో చోటు చేసుకున్న రోడ్ ప్రమాదం లో మహిళా దుర్మరణం చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు ప్రత్యక్ష సాక్షులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మందమర్రి పట్టణానికి చెందిన చంటి మల్లీశ్వరి(38) బైక్ పై వెనకాల కూర్చొని బి. జోన్ సెంటర్ వైపు వెళ్తుండగా,అమరవాది చెరువు పూడిక మట్టి తో చెక్ పోస్ట్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టగా మృతి చెందింది.
ట్రాక్టర్ అతివేగంగా నడపడం ఒక కారణం అయితే, పట్టణంలో పశువులు యదేచ్ఛగా సంచరిస్తూ వాహనాల పైకి దూసుకు రావడం మరో కారణం అని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ప్రమాద విషయమై ఎస్. ఐ శ్రీధర్ ను వివరాలు అడగగా కేసు నమోదు చేసుకొని,సమగ్ర విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని తెలియజేశారు.
