పేదల సొంత ఇంటి కళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

పేదల సొంత ఇంటి కళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: నీరు పేదల సొంత ఇంటి కళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఎనుగందుల లత ప్రసాద్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొనీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఆ దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహూకరించారు.ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుందని,వారి కళ్లలో ఆనందం కనిపిస్తుందని అన్నారు.నియోజకవర్గంలో ఇప్పటికీ 3,500 ఇండ్లను నిర్మిస్తున్నామని, ఇంకా అర్హత కలిగిన పేద వారికి ఎన్నైనా ఇండ్లు మంజూరు చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుంకేట రవి, ఏ ఎం సి వైస్ చైర్మన్ బుచ్చన్న, టౌన్ ప్రెసిడెంట్ సల్లూరి గణేశ్,బుచ్చి మల్లయ్య,రాజేంద్ర ప్రసాద్,అజ్మత్ పాషా, నల్ల సాయికుమార్ గుప్తా,కిషన్,జగదీష్,గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

