Prabhas | కల్కి 2 సెట్ కి వచ్చేది ఎప్పుడు..?

Prabhas | కల్కి 2 సెట్ కి వచ్చేది ఎప్పుడు..?

Prabhas | కల్కి 2 ఎప్పుడు వస్తుంది?
అమితాబ్‌తో కీలక సన్నివేశాలు
మార్చిలో ప్రభాస్ జాయిన్?
దీపికా స్థానంలో సాయిపల్లవి?
త్వరలో స్పష్టత రానుందా?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, యూనివర్శిల్ హీరో కమల్.. కాంబోలో రూపొందిన భారీ చిత్రం కల్కి. ఈ సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. రీసెంట్ గా కల్కి 2 సెట్స్ పైకి వచ్చింది. మరి.. ప్రభాస్ ఈ మూవీ సెట్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడు..? అసలు ఇందులో హీరోయిన్ ఎవరు..?

Prabhas | కల్కి 2 సెట్ లో అమితాబ్..

Prabhas

కల్కి 2 మూవీ ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చింది. ప్రభాస్ వేరే సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండడం వలన ఇంత కాలం కల్కి 2 లేట్ అయ్యింది. ఇప్పుడు డేట్స్ ఇస్తానని చెప్పడంతో నాగ్ అశ్విన్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే.. ప్రస్తుతానికి ప్రభాస్ లేని సీన్స్ షూట్ చేస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్.. పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. కమల్ పై కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా త్వరలో ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్.. మార్చిలో ఈ షూట్ లో జాయిన్ అవుతాడని టాక్.

Prabhas | దీపికా ప్లేస్ లో..

Prabhas

అయితే.. కల్కి 2 అనగానే.. ఇప్పుడు అందరిలో ఒకటే ప్రశ్న. దీపికా పడుకునే తప్పుకుంది కదా.. ఆమె చేయాల్సిన పాత్రను ఎవరు చేస్తారని. కొంత మంది తారల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. ప్రధానంగా ఫిదా బ్యూటీ సాయిపల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ కథ.. అందులోని ఆమె పాత్ర చెప్పిన తర్వాత సాయిపల్లవి నటించేందుకు ఓకే చెప్పింది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అయితే.. సాయిపల్లవి ఓ వైపు రామాయణం సినిమాలో బిజీగా ఉంది. లేటెస్ట్ గా మణిరత్నం సినిమాలో నటించేదుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. మరి.. కల్కి 2 లో నిజంగా నటిస్తుందా అనే డౌట్ వస్తుంది కానీ.. ఆమె ఓకే చెప్పిందనేది కల్కి 2 సన్నిహితులు చెబుతున్న మాట. మరి.. కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Leave a Reply