jobs | డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు …

jobs | డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు …

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

jobs | కర్నూల్ ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ఏ ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగాలు కూడా మధ్యవర్తుల ద్వారా రావు. నిరుద్యోగ యువత దళారుల మాటలు నమ్మి, డబ్బులు ఇచ్చి, మోస పోవద్దు. నిరుద్యోగ యువత మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు వ్యక్తులు నిరుద్యోగ యువత నుండి డబ్బులు తీసుకొని మోసాలు చేస్తున్నారనే ఫిర్యాదులు ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు.

ఈ సంధర్బంగా కర్నూలు ఎస్పీ మాట్లాడుతూ … ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు, కోర్టులో ఉద్యోగాలు, స్టాఫ్ నర్స్, ఫీల్డ్ అసిస్టెంట్, సాఫ్ట్ వేర్ జాబ్స్, బ్యాంకులలో ఉద్యోగాలు, పుడ్ కార్పోరేషన్, విద్యుత్ శాఖ, అగ్రికల్చర్, రెవిన్యూ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లలో జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, క్లర్క్ అంటూ పలు రకాల ఉద్యోగాల పేరుతో వివిధ రకాలుగా దళారులకు డబ్బులు ఇచ్చి యువత మోసపోతూనే ఉన్నారన్నారు.

jobs |

అమాయకులను లక్ష్యంగా ఎంచుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్న నటువంటి సంఘటనల పై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే వారికి ఇంకా డబ్బులు ఇచ్చి మోసపోతూనే ఉన్నారన్నారు. ఎక్కడైనా, ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వారి సమాచారాన్ని స్ధానిక పోలీసు స్టేషన్ లలో లేదా డయల్ 112 కు గాని లేదా డయల్ 100 కు గాని ముందుగానే ఫిర్యాదు చేసి తెలియజేయాలన్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగాల పేరుతో మోసపోతున్న ఫిర్యాదులు ఎక్కువగా అవుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం పోటీ పరీక్షలు మరియు ప్రతిభ ఆధారంగానే లభిస్తాయని , ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం పూర్తిగా మోసపూరితమన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా అర్హతలు, నైపుణ్యాలు మరియు ఎంపిక విధానాల ప్రకారమే నియామకాలు జరుగుతాయన్నారు. యువత మోసపోవద్దని హెచ్చరించారు.

jobs | కర్నూలు ఎస్పీ ప్రజలకు సూచనలు…

ఉద్యోగాల పేరుతో ఎవరికి కూడా డబ్బులు చెల్లించవద్దు. అధికారిక నోటిఫికేషన్లు మాత్రమే నమ్మాలి. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు తెలియజేయాలి. యువత తమ ప్రతిభపై నమ్మకం ఉంచుకుని కష్టపడి చదివి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, మోసగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల పేరుతో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, డబ్బులు ఇచ్చి నష్టపోవద్దని పోటీ పరీక్షలు, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా యువతకు, విద్యార్ధులకు, జిల్లా ప్రజలకు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply